సీఎల్పీ మీ అబ్బ సొత్తా.. ఆ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి వార్నింగ్

దిశ, తెలంగాణ బ్యూరో : కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరి సీఎల్పీ విలీనం చేశారు… ఏ రాజ్యాంగంలో అయినా ఉందా అలా చేయాలని.. సీఎల్పీ మీ అబ్బ సొత్తా… అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసోజు శ్రవణ్ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో తెలంగాణ ద్రోహులకు […]

Update: 2021-07-04 21:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరి సీఎల్పీ విలీనం చేశారు… ఏ రాజ్యాంగంలో అయినా ఉందా అలా చేయాలని.. సీఎల్పీ మీ అబ్బ సొత్తా… అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసోజు శ్రవణ్ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో తెలంగాణ ద్రోహులకు అందలం వేశాడని ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా తెలంగాణ కోసం పనిచేసిన ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులైన ఎర్రబెల్లి, శ్రీనివాస్ యాదవ్, సబిత, పోచారం అంతా వాళ్లే పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్‌కు చెందిన ఓ నాయకుడికి కాంగ్రెస్ రాజకీయ గుర్తింపుతో పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇస్తే ఇప్పుడు సిగ్గులేకుండా పార్టీ మారి కాంగ్రెస్‌లో ఏముంది బొంగు అంటున్నాడని, ఆ బొంగే నీకు జీవితం ఇచ్చిందని లేకుంటే ఫుట్‌పాత్ పై ఉండేటోడివని ధ్వజమెత్తారు.

ఈనెల 7 తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి చెప్తానని, కాంగ్రెస్ కార్యకర్తలతో ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు. మేము రాళ్లతో కొడ్తా అంటే చెప్పుతో కొడతాం అని మాట్లాడుతున్నారని… వాళ్లకు చెప్పుల దండలు వేసి ఊరేగిస్తామని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో గతంలో నాయకులు గౌరవంతో చెప్పారని, అలా చెప్తే వీళ్లు వినే రకం కాదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రైతులు, విద్యార్థులు, యువత అంత నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంట బీమా, సబ్సిడీలు లేవు కానీ చచ్చినంకా కేసీఆర్ డబ్బులు ఇస్తా అంటున్నాడని ఆరోపించారు. పార్టీలో సీనియర్లు క్రియాశీలకంగా ఉన్నారని, అందరితో కలిసి పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News