కేటీఆర్‌ను తీసిపడేసిన రేవంత్ రెడ్డి.. దాంట్లో జూనియర్ అంటూ సెటైర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ అన్నింటా తనకంటే జూనియర్ అని సెటైర్లు వేశారు. తాను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినని, కేటీఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడన్నారు. తాను రాజకీయాల్లో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశానని గుర్తు చేస్తూ.. రాజకీయాలు, పార్టీలు, పదవులు ఎక్కడ చూసినా కేటీఆర్ తనతో సమానం కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుద్దభవన్‌లో ఎన్నికల కమిషనర్ శశాంక్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ అన్నింటా తనకంటే జూనియర్ అని సెటైర్లు వేశారు. తాను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినని, కేటీఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడన్నారు. తాను రాజకీయాల్లో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశానని గుర్తు చేస్తూ.. రాజకీయాలు, పార్టీలు, పదవులు ఎక్కడ చూసినా కేటీఆర్ తనతో సమానం కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుద్దభవన్‌లో ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌ను కలిసి హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏ విషయంలోనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, కేటీఆర్ కూడా చర్చకు రావాలన్నారు. వచ్చే నెల 15లోగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఇక దళిత బంధుపై మరో నాటకానికి తెర లేపారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధుకు అడ్డురాని ఈసీ నిబంధనలు.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ‘ఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారని.. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు చాన్స్ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.