సమాజాభివృద్ధికి వారు కృషి చేయాలి

దిశ, నల్లగొండ: పదవీ విరమణ పొందిన పోలీసులు సమజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్ ఆకాంక్షించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అధికారుల పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందన్నారు. పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు చలపతి రెడ్డి, అబ్దుల్ రషీద్, హెడ్ కానిస్టేబుల్ […]

Update: 2020-05-30 08:13 GMT

దిశ, నల్లగొండ: పదవీ విరమణ పొందిన పోలీసులు సమజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్ ఆకాంక్షించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అధికారుల పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందన్నారు. పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు చలపతి రెడ్డి, అబ్దుల్ రషీద్, హెడ్ కానిస్టేబుల్ కె.ప్రభాకర్ రెడ్డి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.లష్కర్, మహిళా హోమ్ గార్డు నాగరాణిలను ఎస్పీ రంగనాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సి.నర్మద, సీఐ రవీందర్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రమాదవశాత్తు మరణించిన పోలీస్ కుటుంబాలకు చేయూత పథకం కింద ఎస్పీ ఏ.వి.రంగనాథ్ చెక్కులు పంపిణీ చేశారు. కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ భార్య ఈదమ్మకు, మరో కానిస్టేబుల్ జగన్నాథం భార్య లలితకు చేయూత చెక్కులు అందించారు.

Tags:    

Similar News