సరుకుల కోసం ఉరుకులు పరుగులు!
దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా విపత్తు సంభవిస్తే ప్రజలు కంగారు పడటం సహజం. ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో రవాణాకు, సరుకుల సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు రిటైల్ దుకాణాల ముందు క్యూ కట్టారు. జంబో, బండిల్ ప్యాక్‌లు, పెద్ద మొత్తంలో సరుకుల కోసం రెండు రోజులుగా భారీ డిమాండ్ ఏర్పడింది. గత వారాంతం నుంచి కొనుగోళ్లు పెరగడంతో చిల్లర దుకాణాల్లో అమ్మకాలు సాధారణ అమ్మకాలతో పోలిస్తే 30 నుంచి 40 శాతం […]
దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా విపత్తు సంభవిస్తే ప్రజలు కంగారు పడటం సహజం. ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో రవాణాకు, సరుకుల సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు రిటైల్ దుకాణాల ముందు క్యూ కట్టారు. జంబో, బండిల్ ప్యాక్‌లు, పెద్ద మొత్తంలో సరుకుల కోసం రెండు రోజులుగా భారీ డిమాండ్ ఏర్పడింది. గత వారాంతం నుంచి కొనుగోళ్లు పెరగడంతో చిల్లర దుకాణాల్లో అమ్మకాలు సాధారణ అమ్మకాలతో పోలిస్తే 30 నుంచి 40 శాతం పెరిగాయని దుకాణాదారులు చెబుతున్నారు. ముఖ్యంగా చక్కెర, బెల్లం, బియ్యం ఇంకా ఇతర ప్రధాన సరుకుల కోసం కేవలం రెండు రోజుల్లోనే 300 పైగా ఆర్డర్లు వచ్చాయి. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా లేం. అందుకే, సరుకుల డెలివరీల కోసం 3 నుంచి 4 రోజుల ఆలస్యమవుతోందని ఓ కిరాణా స్టోర్ యజమాని తెలిపారు.
కరోనా వ్యాప్తి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన సిటీల్లోని మాల్స్, థియేటర్లు, పాఠశాలలు, కాలేజీలు ఈ నెల చివరి వరకూ మూతబడ్డాయి. పరిస్థితి మరింత క్లిష్టమైతే కిరాణా షాపులు సైతం మూసేస్తారనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. మిగిలిన ప్రాంతాలకంటే ఈ నగరాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడమే దీనికి కారణం. ‘కొనుగోల్లు జరుగుతున్నస్థాయిలో మేం స్టాక్‌ను ఉంచుకోలేదు. ఒకవేళ ఉత్పత్తులు తరిగిపోతే మళ్లీ ఆర్డర్ పెట్టడానికి, అవి తమ వద్దకు రావడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుందని ముంబైలోని ఓ దుకాణం యజమాని చెప్పారు.
స్టాక్ అయిపోతే..
సరుకుల డిమాండ్ పెరగడం అనేది మెట్రో నగరాల్లోనే అధికంగా ఉన్నందున స్టాక్స్ పూర్తీగా ఖాళీ అయ్యే పరిస్థితి లేదని కొందరు వ్యాపారులు అంటున్నారు. మేజర్‌గా బ్రాండ్ బిస్కెట్లు, నూడుల్స్ వంటి వాటికి కొంత మేరకు కొరత ఏర్పడుతుంది.
డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిత్యావసరాలు సాధారణం కంటే ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం జరిగింది. గడిచిన రెండు రోజులుగా దుకాణాల్లో అధిక డిమాండ్‌ను చూస్తున్నాం. ఈ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు కష్టమైనా సిద్ధంగా ఉన్నాం. వినియోగదారులకు సరుకులను ఇచ్చేందుకు తగినంత నిల్వను ఉంచుకోవడానికి కృషి చేస్తున్నామని హైపర్ మార్కెట్ యజమానులు చెబుతున్నారు.
దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంది. దుకాణాల్లో పనిచేసే వ్యక్తులను తాము పెంచుకుంటున్నారు. అలా చేయకపోతే అందరికీ ప్రమాదమే. కొన్ని దుకాణాల్లో రద్దీని ఎదుర్కొనేందుకు టోకెన్ విధానాన్ని దుకాణాదారులు అమలు చేస్తున్నారు. గంటకు కొంతమందికి మాత్రమే సరుకులు ఇచ్చి పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల జనం ఒకచోట గుంపుగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొనే విధానాన్ని నియంత్రిస్తుంది.
భయం వద్దు..
కొందరు దుకాణాదారులు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. వారికి కావాల్సిన సరుకులు సరిపడా దుకాణాల్లో ఉన్నాయని, ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటూ సూచిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో ప్రజలు ఏవి ఎక్కువగా అవసరమని భావిస్తారో వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు. సరుకులను పంపిణీ చేసే వర్గాలు ప్రభావితమయ్యే వరకూ స్థానికంగా ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాదు. అప్పటివరకూ దుకాణాదారులు స్టాక్ కొరతను నియంత్రించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Tags ; coronavirus, Retail, customers rush to buy essentials