రిటైల్ ఇన్వెస్టర్ల కోసం పథకాలను ప్రారంభించిన ప్రధానీ మోదీ!

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనడానికి అనువుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూపొందించిన రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. రిటైల్ డైరెక్ట్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పేరుతో వీటిని ప్రవేశపెట్టారు. రిటైల్ డైరెక్ట్ పథకం ద్వారా చిన్న ఇన్వెస్టర్లు సెక్యూరిటీల్లో పెట్టుబడి, స్థిరమైన రాబడిని పొందేందుకు సహాయపడుతుంది. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పథకం వల్ల ఆర్‌బీఐ నియంత్రణంలోని కంపెనీల కారణంగా ఇన్వెస్టర్లు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం అందుతుంది. ఈ […]

Update: 2021-11-12 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనడానికి అనువుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూపొందించిన రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. రిటైల్ డైరెక్ట్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పేరుతో వీటిని ప్రవేశపెట్టారు. రిటైల్ డైరెక్ట్ పథకం ద్వారా చిన్న ఇన్వెస్టర్లు సెక్యూరిటీల్లో పెట్టుబడి, స్థిరమైన రాబడిని పొందేందుకు సహాయపడుతుంది. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పథకం వల్ల ఆర్‌బీఐ నియంత్రణంలోని కంపెనీల కారణంగా ఇన్వెస్టర్లు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం అందుతుంది. ఈ పథకాల ద్వారా అధిక రాబడితో పాటు సామాన్యుల పెట్టుబడికి భద్రతను అందిస్తాయని, అలాగే, దేశంలోని మౌలిక సదుపాయాలు, ఇతర పెట్టుబడి అవసరాలకు ప్రభుత్వానికి నిధులు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో మోదీ పేర్కోన్నారు.

రిటైల్ డైరెక్ట్ పథకం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్ల మార్గాన్ని సులభతరం చేస్తుంది. వారు ఉచితంగా ఆర్‌బీఐ నుంచి ఆన్‌లైన్‌లో సులభంగా ప్రభుత్వం సెక్యూరిటీ అకౌంట్‌ను ప్రారంభించి నిర్వహించవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా క్రయవిక్రయాలను జరపవచ్చు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పథకంలో భాగంగా ఫిర్యాదులను ఇవ్వడం, డాక్యుమెంట్ అందించడం సహా వాటి స్టేటస్ తెలుసుకునే ప్లాంట్‌ఫామ్‌గా ఉంటుంది. వివిధ భాషల్లో ఫిర్యాదులు చేయడమే కాకుండా దానికి సంబంధించిన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉండనుంది.

Tags:    

Similar News