రేపు ఐదు అసెంబ్లీల ఫలితాలు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ హాల్‌లోకి ఎంటర్ కావాలంటే అభ్యర్థులైనా, పోలింగ్ ఏజెంట్లు అయినా తప్పకుండా కరోనా నెగెటివ్ రిపోర్టు(48 గంటల్లోపుది) సమర్పించాలి, లేదా రెండు కరోనా టీకా డోసులు వేసుకన్న సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఫలితాల అనంతరం విన్నర్లు విజయోత్సవ ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధించింది. విన్నింగ్ క్యాండిడేట్‌తో […]

Update: 2021-05-01 12:10 GMT

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ హాల్‌లోకి ఎంటర్ కావాలంటే అభ్యర్థులైనా, పోలింగ్ ఏజెంట్లు అయినా తప్పకుండా కరోనా నెగెటివ్ రిపోర్టు(48 గంటల్లోపుది) సమర్పించాలి, లేదా రెండు కరోనా టీకా డోసులు వేసుకన్న సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఫలితాల అనంతరం విన్నర్లు విజయోత్సవ ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధించింది. విన్నింగ్ క్యాండిడేట్‌తో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండరాదని తెలిపింది.

తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, పశ్చిమ బెంగాల్‌లో గతనెల 29న పూర్తయిన సంగతి తెలిసిందే. వీటితోపాటు లోక్‌సభ స్థానాలు, పలురాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకూ ఉపఎన్నికలు జరిగాయి. వీటన్నింటి ఫలితాలు ఆదివారం విడుదలవుతున్నాయి. అందరి చూపు పశ్చిమ బెంగాల్ ఫలితాలవైపే వెళ్తున్నాయి. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ జరిగిన సంగతి తెలిసిందే. కేరళ, అసోంలలో అధికార కూటములే తమ స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశముందని, తమిళనాడులో ప్రతిపక్షం అధికారంలోకి రావచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పుదుచ్చేరిలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చే అవకాశమున్నట్టు అంచనాలు వెలువడ్డాయి.

ఐదు అసెంబ్లీలలో మొత్తం స్థానాలు, మెజార్టీ మార్క్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

పశ్చిమ బెంగాల్:
– అసెంబ్లీ స్థానాలు: 294(అభ్యర్థుల మరణాల నేపథ్యంలో రెండు స్థానాల్లో పోలింగ్ జరగలేదు. అంటే 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.)
– మెజార్టీ మార్క్: 148

తమిళనాడు:
– అసెంబ్లీ స్థానాలు: 234
– మెజార్టీ మార్క్: 118

కేరళ:
– అసెంబ్లీ స్థానాలు: 140
– మెజార్టీ మార్క్: 71

అసోం:
– అసెంబ్లీ స్థానాలు: 126
– మెజార్టీ మార్క్: 64

పుదుచ్చేరి:
– అసెంబ్లీ స్థానాలు: 30 (మరియు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు)
– మెజార్టీ మార్క్: 17

Tags:    

Similar News