పండుగలపై ఆంక్షలు తగదు

దిశ ప్రతినిధి ,హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలను విధించడాన్ని వెంటనే నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు మాట్లాడుతూ….కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు నిర్ధేశించిన అన్ని మార్గదర్శకాలను హిందూ సమాజం పాటిస్తోందన్నారు. అయినా హిందూ పండుగలపై లేని పోని ఆంక్షలు విధిస్తుండడంతో హిందువుల మనోభావాలు […]

Update: 2020-10-14 05:19 GMT

దిశ ప్రతినిధి ,హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలను విధించడాన్ని వెంటనే నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు మాట్లాడుతూ….కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు నిర్ధేశించిన అన్ని మార్గదర్శకాలను హిందూ సమాజం పాటిస్తోందన్నారు. అయినా హిందూ పండుగలపై లేని పోని ఆంక్షలు విధిస్తుండడంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. చట్ట ప్రకారం రాజ్యాంగ విధులు నిర్వహించవలసిన పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. హిందువుల పండుగలపై లాఠీ పెత్తనాన్ని ప్రదర్శించడం వారు మానుకోవాలని సూచించారు.

Tags:    

Similar News