కర్ఫ్యూ ఎఫెక్ట్.. థియేటర్లపై ఆంక్షలు కంటిన్యూ..

దిశ, సినిమా : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 20 – 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన సర్కార్.. నేటితో ఆ గడువు ముగియడంతో మే 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రా. 9 గంటల నుంచి ఉ. 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే థియేటర్లలో సినిమా ప్రదర్శనపై ఇప్పటికే ఉన్న ఆంక్షలు యథావిధిగా […]

Update: 2021-04-30 05:36 GMT

దిశ, సినిమా : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 20 – 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన సర్కార్.. నేటితో ఆ గడువు ముగియడంతో మే 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రా. 9 గంటల నుంచి ఉ. 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే థియేటర్లలో సినిమా ప్రదర్శనపై ఇప్పటికే ఉన్న ఆంక్షలు యథావిధిగా అమలవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి ఎనిమిది గంటల లోపు మూడు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం.. మరో ఏడు రోజులు దీన్ని ఎక్స్‌టెండ్ చేసింది. మే 8, ఉ. 5గంటల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

Tags:    

Similar News