సీఎంకు ఎమ్మెల్యే శానంపూడి విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ ద్వారా సీఎం కేసీఆర్‌కు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వినతిపత్రం అందజేశారు. పులిచింతల ముంపు సమస్యలను పరిష్కరించి, సీఎం అధ్యక్షతన మీటింగ్ నిర్వహించాలని కోరారు. పరిహారం విషయంలో తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపారని, ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై సమీక్ష నిర్వహించి పరిహారం చెల్లించాలన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ముంపునకు గురైన 13గ్రామాల బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పులిచింతలలో పూర్తి నీటి నిల్వ 45 టీఎంసీలు నిల్వ చేయడంతో అదనంగా […]

Update: 2020-09-10 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ ద్వారా సీఎం కేసీఆర్‌కు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వినతిపత్రం అందజేశారు. పులిచింతల ముంపు సమస్యలను పరిష్కరించి, సీఎం అధ్యక్షతన మీటింగ్ నిర్వహించాలని కోరారు. పరిహారం విషయంలో తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపారని, ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై సమీక్ష నిర్వహించి పరిహారం చెల్లించాలన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ముంపునకు గురైన 13గ్రామాల బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పులిచింతలలో పూర్తి నీటి నిల్వ 45 టీఎంసీలు నిల్వ చేయడంతో అదనంగా ముంపునకు గురైన 200 ఎకరాలకు పరిహారం చెల్లించాలన్నారు. ప్రాజెక్ట్‌ దిగువన గల వజినేపల్లి, బుగ్గమాధారంలో ప్రస్తుతం వరద తాకిడి ఉందని వారికి పునరావాసం కల్పించాలని రిక్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News