నియంత్రిత సాగు విధానం వద్దంటూ కలెక్టర్ కు వినతిపత్రం
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగును ప్రవేశపెట్టడం రైతులను అవమానించటమేనని కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం విమర్శించారు. నియంత్రిత సాగు విధానాన్ని విరమించుకోవాలంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ చైర్మన్ చంద్రం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులను అవమానపరిచే రీతిలో సాగు విధానం ఉందన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటనే సాగుచేయాలని నిర్బంధం విధించటం సిగ్గుచేటన్నారు. గతంలో రైతులు వారికి ఇష్టమైన పంట సాగుచేసి దిగుబడులు […]
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగును ప్రవేశపెట్టడం రైతులను అవమానించటమేనని కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం విమర్శించారు. నియంత్రిత సాగు విధానాన్ని విరమించుకోవాలంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ చైర్మన్ చంద్రం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులను అవమానపరిచే రీతిలో సాగు విధానం ఉందన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటనే సాగుచేయాలని నిర్బంధం విధించటం సిగ్గుచేటన్నారు. గతంలో రైతులు వారికి ఇష్టమైన పంట సాగుచేసి దిగుబడులు సాధించేవారన్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతది.. ఏ పంట సాగుచేస్తే ఎంత దిగుబడి వస్తది అనేది ఆ భూమిని సాగు చేసే రైతుకే తెలుస్తదని, ప్రభుత్వం చెప్పిన పంట సాగు చేస్తే వచ్చే నష్టం ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు జగదేవపూర్ మండల అధ్యక్షులు నవేందర్ రెడ్డి, బాలయ్య, సురేష్, అత్తు తదితరులు ఉన్నారు.