అందరికీ అందుబాటులో.. జియో మీట్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రభావం వల్ల.. అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పించాయి. దీంతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అవసరంతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్, గూగుల్ మీట్, స్కైప్ వంటి వాటిల్లోనూ వీడియో కాలింగ్ సౌకర్యమున్నా.. పరిమిత సంఖ్యలోనే వీడియో కాల్ మాట్లాడవచ్చు. అయితే టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన వీడియో కాన్ఫరెన్స్ యాప్ ‘జియో మీట్’లో మాత్రం ఒకేసారి 100 […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రభావం వల్ల.. అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పించాయి. దీంతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అవసరంతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్, గూగుల్ మీట్, స్కైప్ వంటి వాటిల్లోనూ వీడియో కాలింగ్ సౌకర్యమున్నా.. పరిమిత సంఖ్యలోనే వీడియో కాల్ మాట్లాడవచ్చు. అయితే టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన వీడియో కాన్ఫరెన్స్ యాప్ ‘జియో మీట్’లో మాత్రం ఒకేసారి 100 మంది పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించింది. జియో.. ఈ యాప్‌ను గతంలోనే ప్రకటించినా, గురువారం అధికారికంగా లాంచ్ చేసింది.
జియో మీట్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై లభిస్తుండగా.. డెస్క్‌టాప్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్ ఇంటర్నెట్ బ్రౌజర్లలో ఈ యాప్‌ను క్రోమ్, ఫైర్‌ఫాక్స్‌లలో మాత్రమే ప్రస్తుతం ఉపయోగించుకునేందుకు వీలు కల్పించారు.
అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండానే.. కేవలం లింక్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజర్ సహాయంతోనే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఇంకా ఈ యాప్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
– జియో మీట్‌లో మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ కావాలి.
– 24 గంటల పాటు ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా వీడియో కాన్ఫరెన్స్ హోస్ట్ చేయొచ్చు.
– సెక్యూరిటీ, ప్రైవసీల పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్‌గా వీటిని నిర్వహించుకోవచ్చు.
– స్క్రీన్ షాట్లను షేర్ చేసుకో వచ్చు.
– సేఫ్ డ్రైవింగ్ మోడ్, డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
– ఇందులోని ది బెస్ట్ ఫీచర్ – మల్టీ డివైజ్ సపోర్ట్. ఓ యూజర్ సింగిల్ ఐడీతో ఒకేసారి 5 డివైజ్‌లలో లాగిన్ కావచ్చు.
– వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ లింక్‌లను ఇతరులకు షేర్ చేసి వాటిని ఓపెన్ చేయడం ద్వారా ఆ టైమ్‌కు యూజర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా చేయవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై యూజర్లు జియో మీట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోచ్చు. అదే మ్యాక్, విండోస్ ప్లాట్‌ఫామ్‌లపై అయితే యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేకుండానే నేరుగా కాన్ఫరెన్స్ లింక్‌ను ఇంటర్నెట్ బ్రౌజర్‌లో పేస్ట్ చేసి దాని ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. నాన్ జియో యూజర్లు కూడా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు.