ఎక్కువగా మీడియాలో కనిపించే కార్పొరేట్ సంస్థగా రిలయన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయం, లాభాలు, మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) భారత్‌లో ఎక్కువసార్లు మీడియాలో కనిపించే కార్పొరేట్‌గా అగ్రస్థానంలో ఉంది. ప్రముఖ ర్యాంకింగ్ సంస్థ విజికీ న్యూస్ స్కోర్ నివేదిక ప్రకారం.. ఈ జాబితాలో ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్‌బీఐ రెండో స్థానంలో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక కార్పొరేట్ సంస్థలు ఎంత తరచుగా వార్తల్లో ఉన్నాయి, పబ్లిసిటీ, రీడర్‌షిప్ ఆధారంగా ఎంపిక […]
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయం, లాభాలు, మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) భారత్‌లో ఎక్కువసార్లు మీడియాలో కనిపించే కార్పొరేట్‌గా అగ్రస్థానంలో ఉంది. ప్రముఖ ర్యాంకింగ్ సంస్థ విజికీ న్యూస్ స్కోర్ నివేదిక ప్రకారం.. ఈ జాబితాలో ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్‌బీఐ రెండో స్థానంలో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక కార్పొరేట్ సంస్థలు ఎంత తరచుగా వార్తల్లో ఉన్నాయి, పబ్లిసిటీ, రీడర్‌షిప్ ఆధారంగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఆరో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఏడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అనంతరం టీసీఎస్, మారుతీ సుజుకి, వొడాఫోన్ ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థలు మిగిలిన స్థానాల్లో ఎంపిక చేయబడ్డాయి.
ఈ జాబితాలో ఎక్కువ ర్యాంకింగ్ సాధించిన ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ఎన్‌టీపీసీ 13వ స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం.. 2021లో టాప్-10 అత్యధికంగా ప్రచారంలో స్టార్టప్‌ల జాబితాలో ఓలా, డ్రీమ్11, సిగ్గీ, ఓయో, ఓలా ఎలక్ట్రిక్, భారత్‌పే, బైజూస్, క్రెడ్, మొబిక్విక్, అన్అకాడమీలు నిలిచాయి. గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ నుంచి రిలయన్స్ సంస్థ 8వ స్థానంలో ఉండగా, ఫేస్‌బుక్ మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత గూగుల్, ఆల్ఫాబెట్, యాపిల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఉన్నాయి.