షాకింగ్ న్యూస్.. అప్పులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకుంటున్న ‘అంబానీ’

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ అంబానీ నేతృత్వతంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తన ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు యెస్ బ్యాంకుకు విక్రయించినట్టు వెల్లడించింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని అందులోంచి బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. కాగా, ఈ కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు కంపెనీ ఓ […]

Update: 2021-04-01 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ అంబానీ నేతృత్వతంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తన ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు యెస్ బ్యాంకుకు విక్రయించినట్టు వెల్లడించింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని అందులోంచి బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. కాగా, ఈ కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2021లో రుణ రహిత సంస్థగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన 2 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ రూ. 3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్‌ను రూ. 900 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యెస్ బ్యాంకుకు రూ. 2 వేల కోట్ల బకాయి ఉంది. అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన అనంతరం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. 10 శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడయింది.

Tags:    

Similar News