ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. ఈఏపీ సెట్‌కు చైర్మన్‌గా కాకినాడ జేఎన్టీయూ ప్రొ.రామలింగరాజు, కన్వీనర్‌గా వి.రవీంద్రలను నియమించారు. అలాగే ఈసెట్ చైర్మన్‌గా అనంతపురం జేఎన్టీయూ ప్రొ.జి.రంగనాథం, కన్వీనర్‌గా సి.శశిధర్‌ను నియమించింది. ఇకపోతే ఐసెట్ చైర్మన్‌గా ఏయూ […]
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. ఈఏపీ సెట్‌కు చైర్మన్‌గా కాకినాడ జేఎన్టీయూ ప్రొ.రామలింగరాజు, కన్వీనర్‌గా వి.రవీంద్రలను నియమించారు. అలాగే ఈసెట్ చైర్మన్‌గా అనంతపురం జేఎన్టీయూ ప్రొ.జి.రంగనాథం, కన్వీనర్‌గా సి.శశిధర్‌ను నియమించింది. ఇకపోతే ఐసెట్ చైర్మన్‌గా ఏయూ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి, కన్వీనర్‌గా జి.శశిభూషణ్‌రావును ప్రకటించారు. పీజీఈసెట్ చైర్మన్‌గా తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రొ.కే రాజారెడ్డిని నియమించగా… కన్వీనర్‌గా సత్యనారాయణను నియమించారు. లాసెట్ చైర్మన్‌గా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రొ. జమునను నియమించగా.. చంద్రకళను కన్వీనర్‌గా నియమించారు. మరోవైపు ఎడ్‌సెట్ చైర్మన్‌గా ఏయూ ప్రొ.ప్రసాదరెడ్డి, కన్వీనర్‌గా వెంకటేశ్వరరావును నియమించింది.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు
ఈఏపీ సెట్ – ఆగస్టు 19-25
ఐ సెట్ – సెప్టెంబర్ 17,18
ఈ సెట్ – సెప్టెంబర్ 19
పీజీ ఈసెట్ – సెప్టెంబర్ 27-30
ఎడ్ సెట్ – సెప్టెంబర్ 21
లా సెట్ – సెప్టెంబర్ 22