ఏపీ బీజీ ఇంటర్ సెట్-2021 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ బీజీ ఇంటర్‌సెట్-2021 ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2021-2022 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న164 సాంఘిక సంక్షేమ జూనియర్‌ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్‌ అకాడెమీస్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు ఉత్తర్వులు ఇచ్చింది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ బీజీ ఇంటర్‌ సెట్‌-2021 ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హతలు: 1.2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే […]

Update: 2021-06-25 03:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ బీజీ ఇంటర్‌సెట్-2021 ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2021-2022 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న164 సాంఘిక సంక్షేమ జూనియర్‌ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్‌ అకాడెమీస్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు ఉత్తర్వులు ఇచ్చింది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ బీజీ ఇంటర్‌ సెట్‌-2021 ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు:
1.2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హులు.
2. 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించకుండా వయస్సు ఉండాలి.
3. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు.
4. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

ఎంపిక విధానం:
1. 2021-22 బీజీ ఇంటర్‌ సెట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక.
2. పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
3. మ్యాథమెటిక్స్‌ 25 ప్రశ్నలు, ఫిజికల్‌ సైన్స్‌ 15 ప్రశ్నలు, బయోసైన్స్‌ 15 ప్రశ్నలు, సోషల్‌ సైన్స్‌ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ 15 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహణ.
4. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా అమలు
5. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
6. ఐఐటీ మెడికల్‌ అకాడెమీస్‌ను ఎంచుకొని, బీజీ ఇంటర్‌ సెట్‌లో మెరిట్‌లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నా పత్రం తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలలో ఉంటుంది.

చివరి తేదీలు :
1. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2. దరఖాస్తుకు చివరి తేది 07.07.2021గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://apgpcet.apcfss.in/inter వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదిని వెల్లడిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News