వీళ్లు ‘గీత’ దాటొచ్చు!

దిశ, నల్గొండ: కరోనా కారణంగా కష్టకాలమొచ్చింది. అలా అని వదిలేస్తే అసలుకే ఎసరొస్తది. కాదని కాలు కదిపితే ఖాకీలు లాఠీలు ఝుళిపిస్తరు. ఇలా దిక్కుతోచని పరిస్థితి.. అంతా అయోమయం. ఈ దృష్ట్యా వాళ్లంతా కలిసి సర్కారు మెట్లెక్కారు. అసలు విషయాన్ని చెప్పి… మాపై కనికరం చూపాలంటూ ఏకరవు పెట్టారు. విషయాన్ని పరిగణించిన ప్రభుత్వం వాళ్లకు కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అదేంటో మీరే ప్రత్యేక కథనంలో చదవండి. విషయమేమిటంటే.. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలో ప్రతి […]

Update: 2020-03-27 07:00 GMT

దిశ, నల్గొండ: కరోనా కారణంగా కష్టకాలమొచ్చింది. అలా అని వదిలేస్తే అసలుకే ఎసరొస్తది. కాదని కాలు కదిపితే ఖాకీలు లాఠీలు ఝుళిపిస్తరు. ఇలా దిక్కుతోచని పరిస్థితి.. అంతా అయోమయం. ఈ దృష్ట్యా వాళ్లంతా కలిసి సర్కారు మెట్లెక్కారు. అసలు విషయాన్ని చెప్పి… మాపై కనికరం చూపాలంటూ ఏకరవు పెట్టారు. విషయాన్ని పరిగణించిన ప్రభుత్వం వాళ్లకు కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అదేంటో మీరే ప్రత్యేక కథనంలో చదవండి.

విషయమేమిటంటే.. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. ఈ లాక్ డౌన్ సమయంలో కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కొన్ని రంగాల వారికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక సడలింపు ఇచ్చింది. కానీ, ఆ సమయంలో సామాజిక దూరం పాటించాలంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే.. తెలంగాణలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌రువాత గీత కార్మికులకు ఉపాధి లేక అల‌మ‌టిస్తున్నారు. వేస‌విలో పోదాళ్లు(ఉదయం వేళ గీసే తాటిచెట్లు), ప‌రుపు తాళ్ల క‌ల్లు వచ్చే చెట్ల‌ను గీయ‌క‌పోవ‌డంతో అవి శాశ్వ‌తంగా ఎండిపోయే ప్ర‌మాద‌మున్న‌ది. అయితే.. జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజున ఎలాంటి ఇబ్బంది పెట్ట‌ని పోలీసులు ఆ త‌రువాత సీఎం కేసీఆర్.. లాక్‌డౌన్‌, జీవో 45, 46 ప్రకటించిన త‌రువాత కట్టుదిట్టం చేశారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డ్రోన్ కెమెరాల సాయంతో గుంపులు గుంపులుగా ఉన్న జ‌నాల‌ను గుర్తించి అక్క‌డికి వెళ్లి క్ష‌ణాల్లో చిత‌క బాదుతున్నారు. దీంతో గత మంగ‌ళ‌వారం నుంచి గీత కార్మికులు తాటిచెట్ల‌ను గీయడంలేదు. అందువల్ల ఆ తాటిచెట్లు పూర్తిగా ఎండిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో లక్ష కార్మికుల కుటుంబాలు రోడ్ల‌పై ప‌డే ముప్పు అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో గీత కార్మిక సంఘం పెద్ద‌లు ప్రయత్నాలు చేశారు. వారంతా కూడా అసలు విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. తాటిచెట్లు గీసుకునేందుకు తమకు లాక్ డౌన్ సమయంలో కొంత వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. లేకపోతే గీత వృత్తిపై ఆధార‌ప‌డిన సుమారు ల‌క్ష మంది కార్మికుల కుటుంబాల మ‌నుగ‌డ‌ ప్ర‌శ్నార్ధ‌కమయ్యే అవకాశాలున్నాయని మంత్రికి తెలిపారు. దీంతో వారి ప్రయత్నాలు ఫలించాయి.

కల్లు విక్రయాలు జరిపేలా చూడాలి..

గీతకార్మికుల ఏకరువును పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వారి సమస్యపై సానుకూలంగా స్పందించి, వారికి ఆ వెసులుబాటును కల్పించింది.కానీ, తాటి వ‌నాల్లో గుంపులు గుంపులుగా కూర్చోని క‌ల్లు సేవించ‌డాన్ని మాత్రం ప్ర‌భుత్వం అంగీక‌రించ‌లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ల‌క్ష మందికి పైగా క‌ల్లుగీత కార్మికులు గీత వృత్తిపై ఆధార‌ప‌డి జీవిస్తున్నందన.. వారు తాటిచెట్లు గీయ‌కుంటే భ‌విష్య‌త్తులో అవి మోడుబారి పోయే ప్ర‌మాదం ఉన్నందున రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌పై సానుకూలంగా స్పందించింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన స‌మ‌యంలోగానే గీత కార్మికులు తాటి వ‌నాల వ‌ద్ద‌కు వెళ్లి ఇళ్లకు చేరుకోవాల‌ని నిర్దేశించిన‌నట్లు గీత‌కార్మిక సంఘం నాయ‌కులు తెలిపారు. తాటి వ‌నాల వ‌ద్ద ఎక్సైజ్ పోలీసులు విజిట్ చేసి.. సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ చేసి అందుకు అనుగుణంగానే క‌ల్లు విక్ర‌యాలు జ‌రిపేలా చూడాలని అదేశించింది.

అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దు

అందుకు త‌గ్గ‌ట్గుగానే ఉమ్మ‌డి నల్లగొండ జిల్లాలో తాటి వ‌నాలు అధికంగా ఉండేటువంటి క‌ట్టంగూర్‌, న‌కిరేక‌ల్‌, చౌటుప్ప‌ల్‌, భువ‌న‌గిరి, యాద‌గిరిగుట్ట‌, పోచంప‌ల్లి, న‌కిరేక‌ల్‌, చిట్యాల‌, సంస్థాన్ నార‌య‌ణ‌పురం, మునుగోడు, దేవ‌ర‌కొండ‌, మ‌ల్లేప‌ల్లి, రామ‌న్న‌పేట‌, సూర్య‌ాపేట‌, కేత‌ేప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు క‌ల్లు అడ్డాల వ‌ద్ద‌కు వెళ్లి సున్నంతో మార్కింగ్ వేశారు. శుక్ర‌వారం క‌ల్లు కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన వారికి క‌రోనా గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. సామాజిక దూరం పాటించ‌డమే క‌రోనా నివార‌ణ‌కు అసలైన మందు అని స్ప‌ష్టంగా వారికి అర్ధ‌మ‌య్యే విధంగా చెప్పారు. ప్ర‌భుత్వం క‌ల్పించిన ఈ అవ‌కాశాన్ని దుర్వినియోగం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వారు హెచ్చ‌రించారు.

వారిలాగే మీకు కూడా..

ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు సోష‌ల్ డిస్టెన్సీ పాటించే విధంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు, పాలు, కూర‌గాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు స‌ర్కార్ ఇంటికొక్క‌రికి అవ‌కాశం క‌ల్పించింది. అలాగే ప‌రిశ్ర‌మ శాఖ‌లో 26 ర‌కాల కంపెనీలు న‌డుపుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. అత్య‌వ‌స‌ర ప‌నులు ఉన్న జ‌నాల‌కు సైతం మిన‌హాయింపు ఇచ్చింది. అలాగే ఉపాధి హామీ కూలీల‌కు ప‌ని క‌ల్పించేందుకు, వ‌రి కోతకు రావ‌డంతో రైతుల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విధంగానే గీత కార్మికులకు వెసులుబాటు కల్పించింది.

Tags : Relaxation, thati chettu, kallu, minister, lockdowns, srinivas goud, police, striking workers

Tags:    

Similar News