ఫేక్ నెంబరు ప్లేట్.. క్రిమినల్ కేసు నమోదు
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఫేక్ నెంబరు ప్లేట్ కలిగిన వాహన యాజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇన్నోవా (టీఎస్ 09 యూసీ 7162) కారును ఆపి పత్రాలు పరిశీలించగా నకిలీ రిజిస్ట్రేషన్ నెంబరుగా తేలింది. ఇన్నోవా కారుకు ఆటో ఎల్లో ప్లేట్ కలిగిన నెంబరును అమర్చారు. అంతే కాకుండా, ఆ సమయలో మూడు సార్లు స్పీడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పలు చలాన్లు […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఫేక్ నెంబరు ప్లేట్ కలిగిన వాహన యాజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇన్నోవా (టీఎస్ 09 యూసీ 7162) కారును ఆపి పత్రాలు పరిశీలించగా నకిలీ రిజిస్ట్రేషన్ నెంబరుగా తేలింది. ఇన్నోవా కారుకు ఆటో ఎల్లో ప్లేట్ కలిగిన నెంబరును అమర్చారు. అంతే కాకుండా, ఆ సమయలో మూడు సార్లు స్పీడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పలు చలాన్లు ఉన్నాయి. ఇన్నోవా కారును సీజ్ చేసి, కారు డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్ పీఎస్‌కు అప్పగించారు.