శాంతించిన గోదావరి.. తగ్గిన వరద
దిశ, బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, ప్రాజెక్ట్ లో నుండి నీటి విడుదల తగ్గడంతో గోదావరి శాంతించింది. అధికారులు దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. దీంతో ఎస్ ఆర్ ఎస్ పీ ప్రాజెక్టులోకి 294550 క్యుసెక్కుల ప్రవాహం వస్తున్నది. 249900 క్యుసెక్కుల నీటిని క్రిందికి వదులుతున్నారు. జెన్ కోకు కేఎంసీ, ఎస్కేప్ గేట్లు ద్వారా 7500 క్యుసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఎస్ ఆర్ ఎస్ […]
దిశ, బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, ప్రాజెక్ట్ లో నుండి నీటి విడుదల తగ్గడంతో గోదావరి శాంతించింది. అధికారులు దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. దీంతో ఎస్ ఆర్ ఎస్ పీ ప్రాజెక్టులోకి 294550 క్యుసెక్కుల ప్రవాహం వస్తున్నది. 249900 క్యుసెక్కుల నీటిని క్రిందికి వదులుతున్నారు. జెన్ కోకు కేఎంసీ, ఎస్కేప్ గేట్లు ద్వారా 7500 క్యుసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు.
గురువారం సాయంత్రం 7 గంటలకు ఎస్ ఆర్ ఎస్ పీలోకి 294550 క్యూసెక్కులు చేరుతుండగా…. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 1091 అడుగులకు గాను.. 1088.30 అడుగులు, 90.313 టీఎంసీల సామర్థ్యానికి గాను 70.383 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు.