అప్పుడూ చెప్పాం.. ఇప్పుడూ చెప్తున్నాం!

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసీఆర్‌సీ) షేర్ చేసిన పాత పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. 1918 స్పానిష్ ఫ్లూ పాండమిక్ సమయంలో తాము వేసిన పేపర్ ప్రకటనను రెడ్‌క్రాస్ ఇప్పుడు షేర్ చేసింది. మాస్క్‌లు ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పే పోస్ట్ అది. దాన్ని గుర్తు చేస్తూ ‘అప్పుడూ చెప్పాం.. ఇప్పుడూ చెప్తున్నాం’ అని రెడ్‌క్రాస్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా అప్పటి, ఇప్పటి పరిస్థితులకు పోలికలను కూడా […]

Update: 2020-10-05 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్:

ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసీఆర్‌సీ) షేర్ చేసిన పాత పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. 1918 స్పానిష్ ఫ్లూ పాండమిక్ సమయంలో తాము వేసిన పేపర్ ప్రకటనను రెడ్‌క్రాస్ ఇప్పుడు షేర్ చేసింది. మాస్క్‌లు ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పే పోస్ట్ అది. దాన్ని గుర్తు చేస్తూ ‘అప్పుడూ చెప్పాం.. ఇప్పుడూ చెప్తున్నాం’ అని రెడ్‌క్రాస్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా అప్పటి, ఇప్పటి పరిస్థితులకు పోలికలను కూడా చెప్పింది. మాస్క్‌లు ధరించి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ పిల్లలను, మీ పక్కింటి వారిని కూడా కాపాడాలని రెడ్‌క్రాస్ అప్పుడు గుర్తు చేసింది, ఇప్పుడు కూడా గుర్తుచేసింది.

ఈ పోస్ట్‌కు ఫిదా అయిన నెటిజన్లు రెడ్‌క్రాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అత్యవసర సమయాల్లో రెడ్‌క్రాస్ చేసిన కృషిని కొనియాడారు. రెడ్‌క్రాస్ చెప్పిన స్టేట్‌మెంట్ వందేళ్ల తర్వాత కూడా చెల్లుబాటు అవుతోందని కామెంట్లు చేశారు. అంతేకాకుండా మాస్క్ ప్రాముఖ్యతను ఈ స్థాయిలో చెబుతున్నా, జనాలు పట్టించుకోకుండా తిరుగుతుండటాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు తప్పుబట్టారు. మరో వందేళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దని, ఈసారితో మాస్క్‌కు స్వస్తి చెప్పే రోజులు రావాలని మరికొందరు నెటిజన్లు కోరుకున్నారు.

Tags:    

Similar News