సరికొత్త రికార్డు సృష్టించిన ఫాస్టాగ్..
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విధానాన్ని 2021 జనవరి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫాస్టాగ్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తాజాగా వసూళ్లలో ఈ నెల 24వ తేదీన ఫాస్టాగ్ కొత్త రికార్డు సృష్టించింది. గురువారం ఒక్క రోజే 50 లక్షల లావాదేవీల ద్వారా రూ.80 కోట్లకు పైగా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విధానాన్ని 2021 జనవరి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫాస్టాగ్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తాజాగా వసూళ్లలో ఈ నెల 24వ తేదీన ఫాస్టాగ్ కొత్త రికార్డు సృష్టించింది. గురువారం ఒక్క రోజే 50 లక్షల లావాదేవీల ద్వారా రూ.80 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కాగా, ఒకేరోజు ఫాస్టాగ్ ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.80 కోట్లకు పైగా ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. అయితే, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.20 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ అయినట్టు ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది.. ఫాస్టాగ్ ద్వారా ఒకే రోజు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు రావడం ఓ మైలురాయిగా అభివర్ణించింది.. ఇక, జనవరి 1వ తేదీ నుంచి నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా దీనిపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.