చైతన్య ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి కారణమిదే.. ఈ తేదీతో సామ్‌కు లింకేంటి? పాపం ట్విస్ట్ మామూలుగా లేదుగా
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం.
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుని వందేళ్లు హ్యాపీగా జీవనం కొనసాగిస్తుంటే.. మరికొంతమంది పెళ్లై పట్టుమని పదేళ్లు కూడా గడవకముందే డివోర్స్ తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. సేమ్ ఇలాగే నాగచైతన్య-సమంత విషయంలో జరిగింది. ఏమాయ చేశావే చిత్రంతో ఒకటై ప్రేమ పెళ్లి చేసుకుని నాలుగేళ్లకే విడిపోయారు. ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నాగార్జున సోషల్ మీడియాలో వదిలారు. నాగచైతన్య కూడా వీరి నిశ్చితార్థం ఫొటోలు ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు.
అయితే నాగ చైతన్య ఇవాళే (ఆగస్టు 8) కు నిశ్చితార్థం చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇదే తేదీ నాడు సామ్, హీరో నాగ చైతన్యకు వెరీ స్పెషల్ లింక్ ఉందంట. ఆగస్టు 8 వ తారీకు నాడే నాగచైతన్యకు సామ్ ప్రపోజ్ చేసిందట. ఇప్పుడు వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక సమంతకు బుద్ధి చెప్పేలా ఇదే తేదీన తన లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంతపై పర్ఫెక్ట్ స్వీట్ రివెంజ్ తీసుకున్నాడని అంటున్నారు. ఇకపోతే వీరి ఎంగేజ్‌మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు శోభితా అక్కినేని కోడలిగా అడుగుపెడుతున్నందున ఈమె బయోడేటా గురించి నెట్టింట చర్చించుకుంటున్నారు. శోభితా ఏపీలో తెనాలిలో జన్మించింది. ఈమె తండ్రి ఉద్యోగం కోసం ముంబై కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఈ హీరోయిన్ భరతనాట్యం, కూచిపూడిలో ట్రైనింగ్ చేసింది. తర్వాత మోడలింగ్ రంగంలోకి దిగింది. అంతేకాకుండా ఫెమినా మిస్ ఇండియా-2013 టైటిల్ విన్నర్ అయ్యింది. మేజర్, పొన్నియన్ సెల్వన్, గూఢచారి, మంకీ మ్యాన్ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించింది.