రాబోయే ఆరు నెలలు రియల్ ఎస్టేట్ రంగానికి కీలకం!
దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాదికి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ సానుకూలంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రభావంతో రానున్న ఆరు నెలల్లో నివాస, కార్యలయాల విభాగంలో డిమాండ్ వృద్ధి చెందుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా, ఫిక్కీ, నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్- క్యూ4 2020′ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో మొదటిసారిగా ప్రస్తుతం సెంటిమెంట్ ఆశావాద ధోరణిలోకి మారింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో […]
దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాదికి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ సానుకూలంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రభావంతో రానున్న ఆరు నెలల్లో నివాస, కార్యలయాల విభాగంలో డిమాండ్ వృద్ధి చెందుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా, ఫిక్కీ, నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్- క్యూ4 2020′ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో మొదటిసారిగా ప్రస్తుతం సెంటిమెంట్ ఆశావాద ధోరణిలోకి మారింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉన్న దానికంటే మెరుగైన పాయింట్లు సమీక్షించిన త్రైమాసికంలో నమోదయ్యాయని నివేదిక తెలిపింది. 2021 ఏడాదిని సానుకూల దృక్పథంతో ప్రారంభించామని, 2020 చివరి రెండు త్రైమాసికాల్లో కనిపించిన వృద్ధి స్థిరత్వాన్ని పరిశీలించాల్సి ఉందని, రానున్న నెలల్లో కీలకమైన ఆర్థిక పనితీరుని నిశితంగా చూడ్డం ముఖ్యమని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ చెప్పారు.