RCB ఫ్రాంచైజీకి కొత్త చైర్మన్

దిశ, స్పోర్ట్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొత్త చైర్మన్‌గా ప్రథమేష్ మిశ్రాను నియమించినట్లు యాజమాన్యం తెలిపింది. డియాగో ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (సీసీవో)గా పనిచేస్తున్న ప్రథమేష్ జులై 1 నుంచి ఆర్సీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కంపెనీ డియాగో ఇండియా సబ్సిడరీ కంపెనీ అయిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్సీబీలో 100 శాతం వాటా ఉన్నది. ఇప్పటి వరకు ఆర్సీబీ చైర్మన్‌గా ఉన్న ఆనంద్ క్రిపాలు పదవీకాలం జూన్ 30తో […]

Update: 2021-07-01 10:17 GMT

దిశ, స్పోర్ట్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొత్త చైర్మన్‌గా ప్రథమేష్ మిశ్రాను నియమించినట్లు యాజమాన్యం తెలిపింది. డియాగో ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (సీసీవో)గా పనిచేస్తున్న ప్రథమేష్ జులై 1 నుంచి ఆర్సీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కంపెనీ డియాగో ఇండియా సబ్సిడరీ కంపెనీ అయిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్సీబీలో 100 శాతం వాటా ఉన్నది. ఇప్పటి వరకు ఆర్సీబీ చైర్మన్‌గా ఉన్న ఆనంద్ క్రిపాలు పదవీకాలం జూన్ 30తో ముగిసింది. ‘మా గ్రూప్‌లోని ప్రతిష్టాత్మక కంపెనీలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉన్నది. విరాట్ కోహ్లీ, మైక్ హెసన్, సైమన్ కటిచ్వంటి వారితో కలసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ఆర్సీబీకి గత చైర్మన్ ఆనంద్ చేసిన సేవలను కూడా మరువలేము’ అని ప్రథమేష్ ఒక ప్రకటనలోపేర్కొన్నారు.

Tags:    

Similar News