లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌ వేలానికి స్పందన కరువు!

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌బీఐ ఇటీవల ప్రవేశ పెట్టిన టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్(టీఎల్‌టీఆర్‌వో) మొదటి విడత వేలంలో బ్యాంకుల నుంచి పెద్దగా స్పంద లేదు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్యలభ్యత పెంచేందుకు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఎవరూ ఆసక్తి చూపించలేదు. 3 ఏళ్ల కాలపరిమితికి రూ. 25 వేల కోట్లకు వేలం జరపగా..ఇందులో కేవలం రూ. 12,850 కోట్లకు మాత్రమే బిడ్‌లు వచ్చాయని సమాచారం. వేలంలో 14 బిడ్‌లు మాత్రమే దాఖలయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. వేలానికి […]

Update: 2020-04-24 08:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌బీఐ ఇటీవల ప్రవేశ పెట్టిన టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్(టీఎల్‌టీఆర్‌వో) మొదటి విడత వేలంలో బ్యాంకుల నుంచి పెద్దగా స్పంద లేదు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్యలభ్యత పెంచేందుకు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఎవరూ ఆసక్తి చూపించలేదు. 3 ఏళ్ల కాలపరిమితికి రూ. 25 వేల కోట్లకు వేలం జరపగా..ఇందులో కేవలం రూ. 12,850 కోట్లకు మాత్రమే బిడ్‌లు వచ్చాయని సమాచారం. వేలంలో 14 బిడ్‌లు మాత్రమే దాఖలయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. వేలానికి స్పంధన విషయంలో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సెక్యూరిటీలను జారీ చేసే కంపెనీల ఆర్థిక బలాలపై బ్యాంకులకు నమ్మకం లేకపోవడం కారణమని చెప్పుకోవచ్చు. బ్యాంకులు ఈ నిధులను పెట్టుబడిగా పెడుతున్న ఎన్‌బీఎఫ్‌సీ, ఎమ్ఎఫ్ఐల్‌ల నుంచి రేటింగ్ కలిగిన డెట్ సెక్యూరిటీలు లేకపోవడమూ మరో కారణం.

ఇటీవల ఆర్‌బీఐ కరోనా నేపథ్యంలో రూ. 50,000 కోట్లకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలకు నిధుల సహకారం అందించేందుకు టీఎల్‌టీఆర్‌వో 2.0ను నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచడానికే ఈ విధానాన్ని ఆర్‌బీఐ మార్చిలో ఎల్‌టీఆర్‌వో ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా బ్యాంకులు సెక్యూరిటీలను తనఖా పెట్టి సంవత్సరం నుంచి 3 ఏళ్ల కాలపరిమితికి రెపో రేటుతో ఆర్‌బీఐ నుంచి నిధులను పొందవచ్చు. బ్యాంకులు ఈ నిధులను బ్యాంకింగేతర సంస్థలకు, సూక్ష్మ రుణ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగిస్తాయి.

Tags: RBI, TLTRO, long term repo operation 2.0

Tags:    

Similar News