Credit card rules : ఆర్‌బీఐ కొత్త నిబంధన.. ఈ వివరాలు లేకపోతే అంతే!

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరింత కఠినతరం చేయనుంది. ఆయా కార్డులపై ఉండే 16 అంకెల నంబరుతో పాటు గడువు తేదీ,సీవీవీ తేదీలను గుర్తుపెట్టుకుని ఆన్‌లైన్ చెల్లింపులు చేయాల్సి రావొచ్చని తెలుతోంది. ఎందుకంటే, 2022, జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలను ఆర్‌బీఐ అమలు చేయాలని భావిస్తోంది. డేటా స్టోరేజీకి సంబంధించిన నిబంధలను ఆర్‌బీఐ మార్చేయనుంది. సాధారణంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో పాటు పేమెంట్ […]

Update: 2021-08-22 06:26 GMT
cards
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరింత కఠినతరం చేయనుంది. ఆయా కార్డులపై ఉండే 16 అంకెల నంబరుతో పాటు గడువు తేదీ,సీవీవీ తేదీలను గుర్తుపెట్టుకుని ఆన్‌లైన్ చెల్లింపులు చేయాల్సి రావొచ్చని తెలుతోంది.

ఎందుకంటే, 2022, జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలను ఆర్‌బీఐ అమలు చేయాలని భావిస్తోంది. డేటా స్టోరేజీకి సంబంధించిన నిబంధలను ఆర్‌బీఐ మార్చేయనుంది.

సాధారణంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో పాటు పేమెంట్ కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేసిన సమయంలో వినియోగదారులు మళ్లీ లావాదేవీ నిర్వహించే సమయంలో కార్డు నంబర్ లేకుండా కేవలం సీవీవీ నంబర్, ఓటీపీ మాత్రమే అవసరం ఉండేది. మొదటిసారి లావాదేవీ నిర్వహించినప్పుడు ఈ-కామర్స్ కంపెనీలు, పేమెంట్ సంస్థలు కార్డు వివరాలను తమ డేటా స్టోర్‌లో ఉంచుకునేవి. ఆర్‌బీఐ కొత్త నిబంధనల వల్ల వచ్చే ఏడాది నుంచి లావాదేవీ నిర్వహించిన ప్రతిసారి కార్డు నంబర్ సహా వివరాలను ఎంటర్ చేయాలి.

ఈ-కామర్స్ కంపెనీలు ఈ వివరాలను స్టోర్ చేయడానికి అవకాశం లేదు. ఇదివరకు ఈ నిబంధనలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా పలు కంపెనీలు ఈ నిబంధనలను వ్యతిరేకించాయి. ఇలాంటి నిబంధన వల్ల డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చాయి. అయితే, ఆర్‌బీఐ మాత్రం వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు చేసే తీరాలని స్పష్టం చేసింది. దీంతో కొత్త నిబంధనలు వచ్చాక వినియోగదారులు సీవీవీతో పాటు కార్డు నంబర్ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి లేదంటే లావాదేవి చేసినప్పుడల్లా కార్డు చూసి చేయాల్సి ఉంటుంది.

New debit card, credit card rules: Everything you need to know

Tags:    

Similar News