వృద్ధి కొనసాగేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో సర్దుబాటు వైఖరి కొనసాగించాలి: అసోచాం!

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి, తద్వారా వేగవంతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అవసరమైనంత కాలం వడ్డీ రేట్లను సర్దుబాటు వైఖరితో కొనసాగించాలని పరిశ్రమల సంస్థ అసోచాం తెలిపింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, ముఖ్యంగా టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ)కి సంబంధించిన భయాలను పరిష్కరించేందుకు అనుకూల వైఖరిని అనుసరించడంతో పాటు ఇతర చర్యలను తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుత కీలక వడ్డీ రేట్లను కొనసాగించేందుకు ఆర్‌బీఐ, ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) మెరుగైన నిర్ణయాలను తీసుకున్నాయి. అయితే, ఇటీవల […]

Update: 2021-11-24 09:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి, తద్వారా వేగవంతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అవసరమైనంత కాలం వడ్డీ రేట్లను సర్దుబాటు వైఖరితో కొనసాగించాలని పరిశ్రమల సంస్థ అసోచాం తెలిపింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, ముఖ్యంగా టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ)కి సంబంధించిన భయాలను పరిష్కరించేందుకు అనుకూల వైఖరిని అనుసరించడంతో పాటు ఇతర చర్యలను తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుత కీలక వడ్డీ రేట్లను కొనసాగించేందుకు ఆర్‌బీఐ, ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) మెరుగైన నిర్ణయాలను తీసుకున్నాయి.

అయితే, ఇటీవల పలు అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థల్లో సెంట్రల్ బ్యాంకులు అనుకూల విధానంలో భాగంగా వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్‌బీఐ అలాంటి నిర్ణయం తీసుకోదనే విశ్వాసం ఉందని అసోచాం అభిప్రాయపడింది. అంతేకాకుండా భారత్‌తో పాటు ముడి చమురు దిగుమతి ప్రధాన వినియోగ దేశాలు ప్రపంచ సరఫరాను పెంచేందుకు, పెరుగుతున్న ధరలను తగ్గించే ప్రయత్నాలు చేయాలని అసోచాం తెలిపింది. అలాగే, బ్యాంకులు లిక్విడిటీ పటిష్టంగా ఉందనేది నిజం, ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులకు క్రెడిట్ డిమాండ్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ సరైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్ముతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లలో సర్దుబాటు వైఖరి కొనసాగకపోతే పెట్టుబడుల్లో వేగవంతమైన పునరుద్ధరణ మందగించవచ్చని అసోచాం వివరించింది.

Tags:    

Similar News