టోకనైజేషన్ అమలును ఆరు నెలలు పొడిగించిన ఆర్‌బీఐ!
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీల్లో కార్డ్, వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్‌ను ఎంటర్ చేసే పనిలేకుండా ఉండేందుకు ఆర్‌బీఐ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని అమలును ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ఆర్‌బీఐ గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు దీనికి ఈ నెల 31 చివరి తేదీ కాగా, దీన్ని 2022, జూన్ 30 కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. టోకనైజేషన్ అనేది వినియోగదారులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్లకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీల్లో కార్డ్, వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్‌ను ఎంటర్ చేసే పనిలేకుండా ఉండేందుకు ఆర్‌బీఐ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని అమలును ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ఆర్‌బీఐ గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు దీనికి ఈ నెల 31 చివరి తేదీ కాగా, దీన్ని 2022, జూన్ 30 కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. టోకనైజేషన్ అనేది వినియోగదారులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్లకు దొరకకుండా ఉండేందుకు ఉద్దేశించబడింది. చెల్లింపుల వ్యవస్థలో మరింత భద్రతను అందించేందుకు ఆర్‌బీఐ టోకనైజేషన్‌ను తీసుకొచ్చింది.
దీనిద్వారా లావాదేవీలు నిర్వహించే సమయంలో కార్డులోని 16 అంకెల నంబర్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కార్డు నంబర్‌తో పాటు సీవీ నంబర్, వ్యక్తిగత వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ వివరాలకు బదులుగా ప్రత్యేక కోడ్ ఉంటుంది. దీన్ని టోకెన్‌గా పరిగణిస్తారు. ఇందులో ఎలాంటి సమాచారం ఉండదు. కేవలం కార్డుకు సంబంధించిన వివరాలకు గుర్తుగా మాత్రమే పనికొస్తుంది. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. చెల్లింపుల సమయంలో ఈ టోకెన్ నంబర్‌ను ఇవ్వడం ద్వరా లావాదేవీలను పూర్తి చేయవచ్చు.