కేసీఆర్ కు గుడికట్టినా.. న్యాయం జరగలే..
దిశప్రతినిధి, ఆదిలాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశాడు. కేసీఆర్ మీద అభిమానంతో ఆయనకు గుడి కట్టించాడు. అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు లేక ఆవేదన చెందుతున్నాడు. సీఎం కేసీఆర్ ను కలవాలంటూ దీక్షకు దిగాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని గుండ రవీందర్ అనే తెలంగాణ ఉద్యమకారుడు తన ఇంటి వద్ద తానే స్వయంగా నిర్మించిన కేసీఆర్ విగ్రహం ఎదుట మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టాడు. టీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు […]
దిశప్రతినిధి, ఆదిలాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశాడు. కేసీఆర్ మీద అభిమానంతో ఆయనకు గుడి కట్టించాడు. అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు లేక ఆవేదన చెందుతున్నాడు. సీఎం కేసీఆర్ ను కలవాలంటూ దీక్షకు దిగాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని గుండ రవీందర్ అనే తెలంగాణ ఉద్యమకారుడు తన ఇంటి వద్ద తానే స్వయంగా నిర్మించిన కేసీఆర్ విగ్రహం ఎదుట మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టాడు. టీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే అవకాశం కల్పించాలని కొరుతున్నాడు. పార్టీలో గుర్తింపు ఇవ్వాలని కోరుతూ రవీందర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.