Ind Vs Nz : కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్

దిశ, వెబ్‌డెస్క్ : రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. భారత గడ్డపై తక్కువ మ్యాచ్‌లో 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్‌ను అశ్విన్ (49) మ్యాచ్‌లో సాధించగా.. అనిల్ […]

Update: 2021-12-06 00:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. భారత గడ్డపై తక్కువ మ్యాచ్‌లో 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు.

ఈ ఫీట్‌ను అశ్విన్ (49) మ్యాచ్‌లో సాధించగా.. అనిల్ కుంబ్లే (52) టెస్టు మ్యాచ్‌లో సాధించాడు. అంతే కాకుండా ఇండియాలో ఎక్కువ వికెట్లు(300) తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ కన్నా ముందు కుంబ్లే (350) వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అశ్విన్ తర్వాత హర్బజన్ సింగ్ (265 వికెట్లు), కపిల్ దేవ్ (219 వికెట్లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసుకున్న జాబితాలో అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరఫున మొదటి మూడు స్థానాల్లో అనిల్ కుంబ్లే (619 వికెట్లు), కపిల్ దేవ్ (434 వికెట్లు), అశ్విన్ (418 వికెట్లు) (రెండో టెస్టులో తీసిన వికెట్లతో కలిపితే అశ్విన్ వికెట్లు 427) ఉండగా హర్బజన్ సింగ్ (417 వికెట్లు)తో నాలుగో స్థానంలో ఉన్నాడు.

న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం.. రికార్డులు బ్రేక్

Tags:    

Similar News