Ravichandran Ashwin: నా దృష్టిలో అతడే అత్యుత్తమ బౌలర్.. మనసులో మాట బయటపెట్టిన అశ్విన్

స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా తోటి టీమ్‌ మేట్ అయిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను తన ప్రశంసలతో ఆకాశానికెత్తాశాడు.

Update: 2024-09-16 06:08 GMT
Ravichandran Ashwin: నా దృష్టిలో అతడే అత్యుత్తమ బౌలర్.. మనసులో మాట బయటపెట్టిన అశ్విన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా తోటి టీమ్‌ మేట్ అయిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను తన ప్రశంసలతో ఆకాశానికెత్తేశాడు. బంగ్లాదేశ్‌ (Bangladesh)తో టెస్ట్ సిరీస్ సందర్భంగా చెన్నైకి వచ్చిన టీమిండియా (Team India) ఆటగాళ్లను అశ్విన్ కలిశాడు. ఈ సందర్భంగా ఆయన తన యూట్యూబ్ ఛానల్‌ (Youtube Channel)లో మాట్లాడుతూ.. తన దృష్టిలో అత్యుత్తమ బౌలర్ బుమ్రానే అని తేల్చి చెప్పాడు. అలాంటి బౌలర్ తరానికి ఒక్కరు మాత్రమే వస్తుంటారని కితాబిచ్చాడు.

భారత జట్టుకు బ్యాటింగ్ లైనప్ ప్రధాన బలమని అలాంటి జట్టు నుంచి బుమ్రా లాంటి ఆటగాడు బౌలింగ్‌లో ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌గా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న టీమిండియా క్రికెటర్లలో అతడే అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు. చెన్నై (Chennai) ప్రజలకు బ్యాట్స్‌మెన్లతో సమానంగా బౌలర్లకు కూడా సపోర్టు చేస్తారని కామెంట్ చేశారు. కాగా, టీ20 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన బుమ్రాకు బీసీసీఐ (BCCI) కొన్నాళ్ల పాటు విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్ కోసం అతడు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 2018లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివ‌ర‌కు 36 మ్యాచులాడి 159 వికెట్లు తీశాడు.

Tags:    

Similar News