అంబటి రాయుడు విషయంలో BCCI తప్పు చేసింది.. రవిశాస్త్రి సంచలన కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో టీమిండియాలో తన కోచింగ్‌ అనుభవాలపై మాట్లాడాడు. ఈ క్రమంలో 2016లో టీమిండియా డైరెక్టర్ పదవి నుంచి తనను తప్పించడం బాధ కలిగించిందని తెలిపాడు. ఆ సమయంలో తనకు ఏ పనీ లేకుండా చేయాలని కొందరు చూశారని […]

Update: 2021-12-10 21:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో టీమిండియాలో తన కోచింగ్‌ అనుభవాలపై మాట్లాడాడు. ఈ క్రమంలో 2016లో టీమిండియా డైరెక్టర్ పదవి నుంచి తనను తప్పించడం బాధ కలిగించిందని తెలిపాడు. ఆ సమయంలో తనకు ఏ పనీ లేకుండా చేయాలని కొందరు చూశారని ఆరోపించాడు.

అంతేకాకుండా భారత జట్టులో స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాను టెస్టు జట్టులోకి తీసుకోవాలన్న నిర్ణయం తనదేనని తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో తెలుగు తేజం అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పేనని రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయుడు లేదా శ్రేయస్‌ జట్టులో ఉండాల్సిందని కుండబద్దలుకొట్టాడు. ధోనీ, పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ల రూపంలో ముగ్గురు వికెట్‌ కీపర్లు జట్టులో ఉండటంలో అర్థం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. అయితే సెలెక్టర్ల నిర్ణయంలో తాను జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.

టీమిండియా 2007, 2014లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్నపుడు బీసీసీఐ పెద్దలు నాకు బాధ్యతలు అప్పగించారని అన్నాడు. ఆ కఠిన సమయాల్లో నేను ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నించానని తెలిపాడు. కానీ, 2016లో ఉన్నట్లుండి నేను జట్టుకు అవసరం లేదు పొమ్మన్నారు. ఆ సమయంలో నాకు ఏ పనీ లేకుండా చేయాలని కొందరు ప్రయత్నించారని ఆరోపించాడు. అయితే తాను తప్పుకున్న తొమ్మిది నెలలకే జట్టులో పెద్ద సమస్య మొదలైందని.. దీంతో మళ్లీ కోచ్ బాధ్యతలను తనకే అప్పగించారని రవిశాస్త్రి వెల్లడించారు.

అంత ఈజీ కాదు కెప్టెన్ రోహిత్ శర్మ.. అజహరుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు

Tags:    

Similar News