ధోని ఆ మాట చెప్పగానే షాక్ అయ్యాం.. రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి క్లారిటీ

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ ధోని 2014, డిసెంబర్ 30న తన టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాక్సిండ్ డే టెస్టు సిరీస్ నేపథ్యంలో 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఉండగానే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనికితోడు ఆ రోజు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది టీమిండియా. అనంతరమే ధోని రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ సమయంలో జట్టు డెరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి MSD రిటైర్మెంట్‌ ప్రకటించగానే […]

Update: 2021-12-27 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ ధోని 2014, డిసెంబర్ 30న తన టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాక్సిండ్ డే టెస్టు సిరీస్ నేపథ్యంలో 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఉండగానే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనికితోడు ఆ రోజు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది టీమిండియా. అనంతరమే ధోని రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆ సమయంలో జట్టు డెరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి MSD రిటైర్మెంట్‌ ప్రకటించగానే అందరం షాక్ అయ్యామని తాజాగా వెల్లడించాడు. ఇదే సమయంలో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పాడన్నారు. అందరినీ డ్రెస్సింగ్ రూములోకి రమ్మన్న ధోని.. ఆ రోజు జరిగిన మ్యాచ్‌పై వివరిస్తాడని అనుకున్నామని.. కానీ, అందరినీ పిలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని కుండ బద్ధలు కొట్టడంతో షాక్‌ అయ్యామన్నాడు రవిశాస్త్రి. కేవలం వైట్ బాల్ క్రికెట్ మీద పూర్తి దృష్టి పెట్టడానికే ధోని తన నిర్ణయం బాహాటంగా చెప్పేశాడని రవిశాస్త్రి మద్దతిచ్చాడు.

Tags:    

Similar News