కరోనా వేళ.. టీఆర్ఎస్ బడా నేత బంధువు రేవ్‌పార్టీ !

దిశ, క్రైమ్‌బ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో అర్థరాత్రి రేవ్‌పార్టీ నిర్వహించిన సంఘటనలో పోలీసులు 8మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హయత్ పార్క్ హోటల్‌లో అర్థరాత్రి సమయంలో యువతీ యువకులు నానా హంగామా సృష్టిస్తున్నారని హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత బంధువు కూడా […]

Update: 2020-07-05 06:21 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో అర్థరాత్రి రేవ్‌పార్టీ నిర్వహించిన సంఘటనలో పోలీసులు 8మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హయత్ పార్క్ హోటల్‌లో అర్థరాత్రి సమయంలో యువతీ యువకులు నానా హంగామా సృష్టిస్తున్నారని హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత బంధువు కూడా ఉన్నారు. బర్త్ డే సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న నలుగురు అమ్మాయిలలో ఒకరు ఉక్రెయిన్‌కు చెందినవారిగా విచారణలో తేలింది. గతంలో రేవ్‌పార్టీ నిర్వహించిన ఓ పబ్ యాజమాని ఇప్పుడు కూడా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.

పోలీసులు ఈ హోటల్‌లో రాత్రి సోదా నిర్వహించిన సందర్భంగా మంత్రి మేనల్లుడినంటూ బెదిరించినట్టుగా కూడా ఒక పోలీసు పేర్కొన్నారు. కరోనా నిబంధనల ప్రకారం హోటళ్లు, పబ్‌లలో పార్టీలు నిషేధం. పార్టీ జరుపుకున్న విషయమై బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావును వివరణ కోరగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఈ పార్టీ జరిగిందని, భౌతిక దూరం పాటించలేదని, అందుకే విజయరామారావు, రఘువీర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి, భాను‌కిరణ్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నలుగురు యువతులను రెస్క్యూ చేసినట్లు తెలిపారు. నలుగురు యువకులపై ఎపిడిమిక్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News