సర్పంచ్ భర్త అరెస్ట్.. అక్రమం అంటూ రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఓద్దుల విజయ భర్త అశోక్ రెడ్డిపై.. గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మండల కేంద్రంలోని పరకాల-ములుగు ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించి.. గండ్ర వెంకటరమణా రెడ్డి వైఖరిని నిరసిస్తూ నినాదాలు […]
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఓద్దుల విజయ భర్త అశోక్ రెడ్డిపై.. గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మండల కేంద్రంలోని పరకాల-ములుగు ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించి.. గండ్ర వెంకటరమణా రెడ్డి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. స్థానిక శాసనసభ్యులు అక్రమంగా కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దానికి ఎస్ఐ ఉదయ్ కిరణ్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అశోక్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లక్ష్మారెడ్డిపల్లి సర్పంచ్ విజయ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అశోక్, కో ఆప్షన్ సభ్యులు చోటేమియ తదితరులు పాల్గొన్నారు.