నిర్మాతగా సత్తా చాటనున్న రష్మిక
దిశ, వెబ్‌డెస్క్: రష్మిక మందన్నా…. టాలీవుడ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటుంది. తాజాగా భీష్మ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలోనూ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో నటిస్తున్న ఈ భామ… మరో అడుగు ముందుకేస్తోందట. స్టార్ హీరోయిన్‌గా మారేందుకు పగలు రాత్రులు కష్టపడుతున్న రష్మిక… నిర్మాతగా […]
దిశ, వెబ్‌డెస్క్: రష్మిక మందన్నా…. టాలీవుడ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటుంది. తాజాగా భీష్మ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలోనూ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో నటిస్తున్న ఈ భామ… మరో అడుగు ముందుకేస్తోందట. స్టార్ హీరోయిన్‌గా మారేందుకు పగలు రాత్రులు కష్టపడుతున్న రష్మిక… నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందట. ఎప్పుడూ ఉమెన్ పవర్ గురించి మాట్లాడే రష్మిక.. నిర్మాతగా, హీరోయిన్‌గా ఏకకాలంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతుందట. కథానాయికలు నిర్మాతగా మారడం ఓకే … కానీ నిర్మాతగా రాణించడం అంటే మాటలు కాదు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభం ఉంటే తప్పా ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అవడం సాధ్యం కాదు. దీంతో కెరియర్‌లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న రష్మిక.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయింది. కానీ ఏ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేసే రష్మిక.. హీరోయిన్‌గా మెప్పించింది సరే… నిర్మాతగా డబ్బులు సంపాదిస్తుందా? లేదా? చూడాలి మరి.
Tags: Rashmika Mandanna, Heroine, Producer, Bheeshma, Sukumar -Bunny Movie