డెఫ్ కమ్యూనిటీకి రణ్‌వీర్ సపోర్ట్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎప్పుడూ సూపర్ కూల్‌గా ఉంటాడు. ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా చెప్పుకునే హీరో.. ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయినా సరే, తన ఎనర్జీతో ఆ ప్రోగ్రామ్‌‌కు మరింత ఎనర్జీ యాడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇంత చిల్‌గా కనిపించే రణ్‌వీర్.. మూగ, చెవుడు వాళ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. భారత ప్రభుత్వం నుంచి వారికి ప్రయోజనాలు […]

Update: 2020-09-22 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎప్పుడూ సూపర్ కూల్‌గా ఉంటాడు. ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా చెప్పుకునే హీరో.. ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయినా సరే, తన ఎనర్జీతో ఆ ప్రోగ్రామ్‌‌కు మరింత ఎనర్జీ యాడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇంత చిల్‌గా కనిపించే రణ్‌వీర్.. మూగ, చెవుడు వాళ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. భారత ప్రభుత్వం నుంచి వారికి ప్రయోజనాలు కలిగేలా తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. చాలా కాలంగా ఈ ప్రయత్నంలో ఉన్న తను.. ఈ సారి బిగ్ మెమొంటో తీసుకోబోతున్నాడు.

ఇండియన్ సైన్ లాంగ్వేజ్( భారతీయ సంకేత భాష)ను భారతదేశపు 23వ అధికారిక భాషగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న రణ్‌వీర్.. సెప్టెంబర్ 23న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, ఇంటర్నేషల్ వీక్ ఆఫ్ డెఫ్’ను పురస్కరించుకొని తన సొంత మ్యూజిక్ లేబుల్ IncInk ద్వారా ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌పై మరింత అవగాహన పెంచేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా సైన్ లాంగ్వేజ్‌తో కూడిన రెండు సాంగ్స్ రిలీజ్ చేయబోతున్న ఈ హీరో.. ఈ వారం రోజుల్లో డెఫ్ కమ్యూనిటీతో చర్చలు జరిపేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

దీంతో పాటు ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌ను భారత అధికారిక భాషగా ఆమోదించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా సంతకాల సేకరణ చేపడుతున్న రణ్‌వీర్ సింగ్.. భారత యువత ఇందుకు సపోర్ట్ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ ప్రయత్నం ఫలిస్తే దాదాపు పది మిలియన్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని.. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపట్టాలని కోరారు.

Tags:    

Similar News