రానా యూట్యూబ్ చానల్ లాంచ్..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కొత్త మార్గాలకు నాంది పలికింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల అభిరుచిని మార్చేసింది. తమకు నచ్చిన కంటెంట్‌ను వెతుక్కునేందుకు డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించేలా చేసింది. దీంతో ప్రముఖులు కూడా అదే దారిలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. స్టార్ సెలెబ్రిటీలు సైతం యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేసి, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త యూట్యూట్ చానల్ లాంచ్ చేసిన దగ్గుబాటి రానా.. అమేజింగ్ కంటెంట్‌తో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ […]

Update: 2020-11-09 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కొత్త మార్గాలకు నాంది పలికింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల అభిరుచిని మార్చేసింది. తమకు నచ్చిన కంటెంట్‌ను వెతుక్కునేందుకు డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించేలా చేసింది. దీంతో ప్రముఖులు కూడా అదే దారిలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. స్టార్ సెలెబ్రిటీలు సైతం యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేసి, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త యూట్యూట్ చానల్ లాంచ్ చేసిన దగ్గుబాటి రానా.. అమేజింగ్ కంటెంట్‌తో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు.

‘సౌత్ బే’ పేరుతో లాంచ్ అయిన యూట్యూబ్ చానల్‌లో పది సెకన్ల నుంచి పది గంటల నిడివి గల మల్టీ లింగువల్, మల్టీ ఫార్మాట్ స్టోరీస్‌తో రానా వచ్చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చానల్‌లో మెయిన్ స్ట్రీమ్ టాలెంట్‌ను ప్రోత్సహించడం ద్వారా కల్చరల్ కంటెంట్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు ‘వై ఆర్ యూ?’ పేరుతో చాట్ షో కూడా డిజైన్ చేసిన రానా.. ఫిల్మ్, మ్యూజిక్ ఇండస్ట్రీస్‌కు చెందిన గ్లోబల్ అండ్ లోకల్ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారు. కాగా కరణ్ జోహార్, కంగనా రనౌత్, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News