తెరపై మరోసారి రమ్యకృష్ణ విలనిజం
దిశ, వెబ్‌డెస్క్: రమ్యకృష్ణ… ఒక పాత్ర చేసిందంటే ఆ పాత్రను టచ్ చేసేందుకు కూడా ఎవరు సాహసించరు. అంత గొప్పగా ఆ పాత్రకు జీవం పోస్తుంది. ‘నీలాంబరి’గా రుద్రరూపం చూపినా… ‘శివగామి’గా మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఏలినా… ‘అమ్మోరు’గా ‘దేవత’గా అవతారం ఎత్తినా… ‘శ్యామల’గా ఓ సగటు ఇల్లాలిగా కనిపించినా… ‘గ్లామర్ డాల్’గా ఓ ఊపు ఊపేసినా… రమ్యకృష్ణకే చెల్లింది. తన సినీ జీవితంలో ఏ పాత్ర చేసినా ఒక మైలు రాయిని సెట్ చేసింది రమ్య. నీలాంబరిగా […]
దిశ, వెబ్‌డెస్క్: రమ్యకృష్ణ… ఒక పాత్ర చేసిందంటే ఆ పాత్రను టచ్ చేసేందుకు కూడా ఎవరు సాహసించరు. అంత గొప్పగా ఆ పాత్రకు జీవం పోస్తుంది. ‘నీలాంబరి’గా రుద్రరూపం చూపినా… ‘శివగామి’గా మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఏలినా… ‘అమ్మోరు’గా ‘దేవత’గా అవతారం ఎత్తినా… ‘శ్యామల’గా ఓ సగటు ఇల్లాలిగా కనిపించినా… ‘గ్లామర్ డాల్’గా ఓ ఊపు ఊపేసినా… రమ్యకృష్ణకే చెల్లింది. తన సినీ జీవితంలో ఏ పాత్ర చేసినా ఒక మైలు రాయిని సెట్ చేసింది రమ్య.
నీలాంబరిగా విలనిజాన్ని ప్రదర్శించి సూపర్ స్టార్ రజినీకాంత్‌కే సవాల్ విసిరిన రమ్యకృష్ణ… ఇప్పుడు మరోసారి అదే రేంజ్ విలన్‌గా మారబోతున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నారట శివగామి. పొలిటికల్ డ్రామాగా, కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న సినిమాలో పవర్ ఫుల్ పొలిటిషియన్‌గా ఆకట్టుకోబోతున్నారు. శివగామి తర్వాత రమ్యకృష్ణ అంతటి పవర్ ఫుల్ రోల్ చేయబోయేది ఈ సినిమాలోనే అని చెబుతోంది మూవీ యూనిట్. కాగా.. ‘క్వీన్’ వెబ్ సిరీస్‌లో తలైవి జయలలితగా నటించి ప్రశంసలు అందుకున్న రమ్యకృష్ణ… ఇప్పుడు మరో పొలిటికల్ డ్రామాలో కనిపించబోతుండడంతో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు తన ఫ్యాన్స్. ప్రస్తుతం తన భర్త, దర్శకులు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రమ్యకృష్ణ. కింగ్ నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాలోనూ రమ్య నటిస్తోందని సమాచారం.
Tags : Ramyakrishna, Deva Katta, Sai Dharam Tej, Villainism, Powerful Villain