‘ఎన్నికల్లో గెలిచింది టీఆర్ఎస్ కాదు.. పీవీ కుటుంబం’

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఎవరికి దక్కుతుందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావు ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వచ్చిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణీదేవి గెలుపు పీవీ కుటుంబానిదా? లేదా టీఆర్ఎస్ పార్టీదా? అనేది స్పష్టం చేయాలన్నారు. తామ మాత్రం పీవీ కుటుంబం గెలుపుగానే భావిస్తున్నామన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి భంగపాటు ఎదురవడంతో.. […]

Update: 2021-03-20 13:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఎవరికి దక్కుతుందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావు ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వచ్చిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణీదేవి గెలుపు పీవీ కుటుంబానిదా? లేదా టీఆర్ఎస్ పార్టీదా? అనేది స్పష్టం చేయాలన్నారు. తామ మాత్రం పీవీ కుటుంబం గెలుపుగానే భావిస్తున్నామన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి భంగపాటు ఎదురవడంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం బరిలోకి దింపిందన్నారు. ఎన్నికల టైంలో అధికార పార్టీ నాయకులు కోడ్లను ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల్లో మాత్రం గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు 24 నుంచి 25 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారని తెలిపారు. ఇకముందు సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొన్నదని వెల్లడించారు.

Tags:    

Similar News