రామారెడ్డిలో విషాదం.. భూ తగాదాలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

దిశ, రామారెడ్డి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి భూ తగాదాల సమస్యలు ఎదురుకావడంతో మనస్థాపం చెంది చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అంబీర్ భువనేశ్వర్ రావు వివరాల ప్రకారం.. చెలిమోటి నరేష్(32) అనే వ్యక్తి గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికితోడు ఇటీవల భూ సమస్యలు కూడా తీవ్రతరం కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఇంటి వెనకాల ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. […]

Update: 2021-12-05 07:21 GMT
Man suicide
  • whatsapp icon

దిశ, రామారెడ్డి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి భూ తగాదాల సమస్యలు ఎదురుకావడంతో మనస్థాపం చెంది చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అంబీర్ భువనేశ్వర్ రావు వివరాల ప్రకారం.. చెలిమోటి నరేష్(32) అనే వ్యక్తి గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికితోడు ఇటీవల భూ సమస్యలు కూడా తీవ్రతరం కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఇంటి వెనకాల ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇంటి వెనకాలకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, అప్పటికే ఉరి వేసుకొని చనిపోయాడు. దీంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News