వీపీ సింగ్ కేబినెట్‌లో తొలిసారి…

దిశ, తెలంగాణ బ్యూరో: 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న క్యాబినెట్‌లో రాంవిలాస్ పాశ్వాన్ తొలిసారిగా కేంద్ర మంత్రి అయ్యి కార్మిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1996-98లో ఐకె గుజ్రాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కూడా కేంద్రమంత్రిగా రైల్వే మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహించారు. 1999-2001లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 2001-02లో బొగ్గు శాఖ మంత్రిత్వశాఖకు మారారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి 2004లో […]

Update: 2020-10-08 11:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న క్యాబినెట్‌లో రాంవిలాస్ పాశ్వాన్ తొలిసారిగా కేంద్ర మంత్రి అయ్యి కార్మిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1996-98లో ఐకె గుజ్రాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కూడా కేంద్రమంత్రిగా రైల్వే మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహించారు. 1999-2001లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 2001-02లో బొగ్గు శాఖ మంత్రిత్వశాఖకు మారారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి 2004లో యూపీఏతో పొత్తు పెట్టుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలో రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి ఇప్పటివరకు నరేంద్రమోడీ క్యాబినెట్‌లో ఆహార పౌరసరఫరాల మంత్రిగా కొనసాగుతున్నారు. 1996-2020 వరకు అన్ని ప్రభుత్వాల్లోనూ కంటిన్యూగా కేంద్ర మంత్రిగా ఉన్నారు.

Tags:    

Similar News