బొమ్మరిల్లు హాసినికి ఇస్మార్ట్ శంకర్ విషెస్

తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి జెనిలీయా. బొమ్మరిల్లు సినిమాతో తెలుగింటి హాసినిగా స్థిరపడిపోయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ జంట.. ఇటీవలే ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో కొత్త బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు జెనీలియా తన పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ చాక్లెట్ హీరో రామ్ జెన్నీకి బర్త్ […]

Update: 2020-08-05 07:50 GMT
బొమ్మరిల్లు హాసినికి ఇస్మార్ట్ శంకర్ విషెస్
  • whatsapp icon

తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి జెనిలీయా. బొమ్మరిల్లు సినిమాతో తెలుగింటి హాసినిగా స్థిరపడిపోయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ జంట.. ఇటీవలే ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో కొత్త బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు జెనీలియా తన పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ చాక్లెట్ హీరో రామ్ జెన్నీకి బర్త్ డే విషెస్ తెలిపాడు.

‘నిస్వార్థమైన స్నేహమా హ్యపీ బర్త్ డే టూ యూ.. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను జెన్నూ. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్‌ చేశారు రామ్‌. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌, వారి పిల్లలు ఉన్నారు. రామ్‌, జెనీలియా 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్‌. ముంబైలోని రితేష్, జెనీలియాల ఇంటికి కూడా రామ్ వెళుతుంటాడు.

https://twitter.com/ramsayz/status/1290884817731559425?s=20

Tags:    

Similar News