మూడేళ్లలో అయోధ్య రామ మందిరం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో తలపెట్టిన రామ మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తికానుంది. నిర్మాణ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 1100 కోట్లు దాటనుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ వెల్లడించారు. ప్రధాన ఆలయం మూడు నుంచి మూడున్నరేళ్ల కాలంలో పూర్తవుతుందని తెలిపారు. దీనికి 300 నుంచి 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తం 70 ఎకరాలను అభివృద్ధి చేయడానికి రూ. 1100 కోట్లకు పైగా వ్యయమవుతుందని […]
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో తలపెట్టిన రామ మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తికానుంది. నిర్మాణ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 1100 కోట్లు దాటనుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ వెల్లడించారు. ప్రధాన ఆలయం మూడు నుంచి మూడున్నరేళ్ల కాలంలో పూర్తవుతుందని తెలిపారు. దీనికి 300 నుంచి 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తం 70 ఎకరాలను అభివృద్ధి చేయడానికి రూ. 1100 కోట్లకు పైగా వ్యయమవుతుందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణ ప్రాజెక్టులో నిపుణులను సంప్రదించిన తర్వాతే తాను ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపారు. నిర్మాణ సంబంధ అంశాలపై న్యాస్ త్వరలోనే స్వయంగా అధికారిక ప్రకటన చేయనుందని చెప్పారు.
రామ మందిర నిర్మాణానికి బడా కార్పొరేట్ల నుంచి సులువుగా నిధులను సేకరించవచ్చునని, కొందరు తమను అభ్యర్థించారు కూడా అని తెలిపారు. కానీ, ఆ ఆఫర్లను మర్యాదపూర్వకంగా తిరస్కరించామని అన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులను 6.5 లక్షల గ్రామాల్లో 15 కోట్ల కుటుంబాల నుంచి విరాళాలుగా సేకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా బీజేపీ చేస్తున్న క్యాంపెయిన్‌గా నిధుల సేకరణ కార్యక్రమం జరుగుతున్నదన్న ఆరోపణలపైనా స్పందించారు. వారు పెట్టుకున్న రంగుల కళ్లజోడుకు అనుగుణంగానే విషయాలను చూస్తుంటారని, తాము ఎలాంటి కళ్లజోడు పెట్టుకోలేదని, కేవలం భక్తిమార్గంలోనే తాము ప్రయాణిస్తున్నామని వివరించారు.