మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టిన వర్మ.. రియల్ మెగాస్టార్ బన్నీనే అంటూ
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈసారి రాఖీ పండగ, చిరు బర్త్ డే రెండు ఒకేసారి రావడం మెగా వారింట సంబురాలు అంబరాన్నంటాయి. మెగా హీరోలతో ఇల్లంతా కళకళలాడింది. మరిముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు హాజరు కావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఫిల్ గా కనిపించింది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఇవన్నీ […]
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈసారి రాఖీ పండగ, చిరు బర్త్ డే రెండు ఒకేసారి రావడం మెగా వారింట సంబురాలు అంబరాన్నంటాయి. మెగా హీరోలతో ఇల్లంతా కళకళలాడింది. మరిముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు హాజరు కావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఫిల్ గా కనిపించింది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం అందరి దృష్టి అల్లు వారి ఫ్యామిలీ మీదే ఉంది.
ఎప్పుడు మెగా వేడుక జరిగినా అల్లు ఫ్యామిలీయే ముందుండేది. కానీ ఈసారి మాత్రం అల్లు వారబ్బాయిలు ఒక్కరు కూడా మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో మెరవకపోవడంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ ఈ ముగ్గురు అన్నదమ్ములు ఈ వేడుకలో మిస్సయ్యారు. పోనీ.. వీరందరూ షూటింగ్ లలో బిజీ గా ఉన్నా కనీసం బన్నీ వైఫ్ స్నేహ, వారి పిల్లలు అర్హ, అయాన్ కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీలో అంత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ గైర్హాజరుతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ షూటింగ్ లో బిజీ ఉండి రాలేకపోయాడులే అనుకోని అభిమానులు సరిపెట్టుకొనేలోపు మరోసారి రచ్చచేయడానికి దిగిపోయాడు వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మెగా ఫ్యామిలీ- అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు పెడుతూ ట్విట్టర్ లో మరో వివాదానికి తెరలేపాడు. అల్లు అర్జున్, చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ కి హాజరు కాకపోవడంపై వర్మ ట్వీట్ చేస్తూ.. అల్లు అర్జున్ అసలైన సెల్ఫ్ మేడ్ స్టార్ .. చిరంజీవి ఫ్యామిలీ లో ఉన్న మిగతా హీరోలు.. మెగా అని చెప్పుకొని తిరిగేవారిలా కాదు. అందుకే ఇలాంటి పార్టీస్ కి అల్లు అర్జున్ అటెండ్ కాడు అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అల్లు రామలింగయ్య ఫ్యామిలీ ఆయన మనవడు అల్లు అర్జున్ మాత్రమే రియల్ మెగాస్టార్ అని, చిరు బంధువులని చెప్పుకుంటున్నవారెవరు కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్స్ పై మెగా ఫ్యాన్స్ వర్మను తిడుతుంటే.. బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అసలు చిరు అనేవాడు లేకపోతే బన్నీ అనేవాడు ఎలా వచ్చేవాడు అని కొందరు. చిరు మామ అంటే ప్రాణం అనుకుంటూ చెప్పుకు తిరిగే బన్నీ చిరు ట్విట్టర్ ని కూడా ఫాలో కాడు.. అతను మెగాస్టార్ ఎలా అవుతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.