స్టైలిష్ లుక్‌లో లైఫ్ టిప్స్ చెప్పిన రకుల్
దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తరచూ సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్, బ్యూటీ టిప్స్ చెప్తుండే రకుల్.. ఈ రోజు (ఆదివారం) ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా సరికొత్త నినాదమిచ్చింది. ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉండేందుకు ఈ స్లోగన్ ఫాలో అవ్వాలని కోరింది. వైట్ షర్ట్, షార్ట్‌తో పాటు స్టైలిష్ గాగుల్స్ ధరించి షిప్‌పై కూర్చొని ఉన్న తన ఫొటోను ఇన్‌స్టా […]
దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తరచూ సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్, బ్యూటీ టిప్స్ చెప్తుండే రకుల్.. ఈ రోజు (ఆదివారం) ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా సరికొత్త నినాదమిచ్చింది. ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉండేందుకు ఈ స్లోగన్ ఫాలో అవ్వాలని కోరింది. వైట్ షర్ట్, షార్ట్‌తో పాటు స్టైలిష్ గాగుల్స్ ధరించి షిప్‌పై కూర్చొని ఉన్న తన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘సండే మూడ్, హ్యాపీ ఈస్టర్’ క్యాప్షన్‌తో ‘జీవించినంత కాలం, శ్వాస తీసుకున్నంత వరకు నవ్వండి’ అని చెప్పింది. ఈ భామ ప్రజెంట్ హిందీలో ‘సర్దార్ కా గ్రాండ్ సన్, డాక్టర్ జీ, మే డే’తో పాటు తెలుగులో క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది.