ప్రియుడిపై రాఖీ సావంత్ అనుమానం.. మాజీ ప్రియురాలితో అలా..

దిశ, సినిమా : కాంట్రవర్షియల్ క్వీన్ రాఖీ సావంత్ ప్రియుడు ఆదిల్ దుర్రానీతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2022-09-21 09:05 GMT

దిశ, సినిమా : కాంట్రవర్షియల్ క్వీన్ రాఖీ సావంత్ ప్రియుడు ఆదిల్ దుర్రానీతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. గత రిలేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె.. ఆదిల్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ ఆమె ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుండటంతో మ్యారేజ్ పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తోందని ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఆదిల్. మాజీ ప్రియురాలితో మాట్లాడుతున్నానని రాఖీ తనను అనుమానిస్తుంటుందని తెలిపాడు. 'నేను నా స్వస్థలం మైసూర్‌కి వెళ్ళినప్పుడు, ఆమె నన్ను తనిఖీ చేయడానికి వ్యక్తులను పంపుతుంది. అలాంటప్పుడు వివాహం చేసుకోవడం మంచిది కాదు. దీని తర్వాత కుటుంబాల ప్రమేయం ఉంటుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే రాఖీ పూర్తిగా నమ్మిన తర్వాతే నేను ఆమెను పెళ్లి చేసుకోగలను' అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : సోనాలీ ఫోగట్ డెత్ కేసు.. విచారణలో షాకింగ్ విషయాలు

Tags:    

Similar News