72 బోయింగ్ విమానాలను ఆర్డర్ చేసిన 'ఆకాశ ఎయిర్'!

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఏర్పాటు చేసిన ఆకాశ ఎయిర్ సంస్థ తాజాగా 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేసినట్టు మంగళవారం వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66.9 వేల కోట్లు) అని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా గత కొన్నాళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటున్న గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్‌కు సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందానికి […]

Update: 2021-11-16 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఏర్పాటు చేసిన ఆకాశ ఎయిర్ సంస్థ తాజాగా 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేసినట్టు మంగళవారం వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66.9 వేల కోట్లు) అని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా గత కొన్నాళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటున్న గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్‌కు సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఒప్పందానికి సంబంధించి ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ.. మొదటి విమానాల ఆర్డర్ కోసం బోయింగ్‌ కంపెనీతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. కొత్త 737 మ్యాక్స్ విమానాలతో వ్యయ తగ్గింపు మాత్రమే కాకుండా తక్కువ ధరలకే ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలతో సేవలందించేందుకు వీలవుతుంది. తద్వారా పర్యావరణ అనుకూలమైన సంస్థగా ‘ఆకాశ ఎయిర్’ను నిర్వహించాలని, ఈ విమానాలు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పాటునందిస్తాయని’ వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం భారత విమానయాన సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉందని వినయ్ దూబే పేర్కొన్నారు.

ఇప్పటికే విమాన ప్రయాణాల్లో బలమైన పునరుద్దరణ చూస్తున్నాం. భవిష్యత్తులో ఇది మరింత వృద్ధి సాధిస్తుంది. భారత్ ఎదుగుదలను శక్తివంతం చేయడమే ఆకాశ ఎయిర్ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ‘వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా పర్యావరణ అనుకూలమైన దిశగా ఆకాశ ఎయిర్ స్థిరమైన లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు కంపెనీకి కృతజ్ఞతలు చెబుతున్నట్టు’ బోయింగ్ కమర్షియల్ విభాగం అధ్యక్షుడు స్టాన్ డీల్ అన్నారు.

Tags:    

Similar News