రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అతని కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో కిడ్నీ ఫెయిల్ కావడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్న ఆయన కొన్నినెలలుగా సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1996లో అమర్‌సింగ్ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ […]
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అతని కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో కిడ్నీ ఫెయిల్ కావడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్న ఆయన కొన్నినెలలుగా సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
1996లో అమర్‌సింగ్ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ జనరల్ సెక్రటరీగా పనిచేసి.. ములాయి సింగ్‌తో విభేదాల కారణంగా 2010లో పార్టీకి పదవులకు రిజైన్ చేశారు. అప్పుడు ఆయన్ను పార్టీ బహిష్కరించింది. ప్రముఖ హీరోయిన్ జయప్రదను యూపీ పాలిటిక్స్‌కు అమర్‌సింగ్ పరిచయం చేయగా.. ఇద్దరినీ ఒకేసారి ఎస్పీ బహిష్కరించింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తో అమర్‌సింగ్‌కు సత్సంబంధాలు ఉన్నాయి.