అమర్‌నాథ్ ఆలయంలో రాజ్‌నాథ్ ప్రత్యేక పూజలు

దిశ, వెబ్ డెస్క్: మంచు కొండల మధ్య వెలిసన ప్రముఖ పుణ్యక్షేతం అమర్‌నాథ్ అలయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సందర్శించారు. కశ్మీర్, లడఖ్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. రాజ్‌నాథ్ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే కూడా ఉన్నారు. అనంతరం ఎల్ఓసీకి సమీపంలోని కుప్వారా జిల్లాలో ఒక ఫార్వార్డ్ పోస్ట్‌ను రక్షణ మంత్రి సందర్శించారు. అక్కడి […]

Update: 2020-07-18 05:49 GMT
అమర్‌నాథ్ ఆలయంలో రాజ్‌నాథ్ ప్రత్యేక పూజలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మంచు కొండల మధ్య వెలిసన ప్రముఖ పుణ్యక్షేతం అమర్‌నాథ్ అలయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సందర్శించారు. కశ్మీర్, లడఖ్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. రాజ్‌నాథ్ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే కూడా ఉన్నారు. అనంతరం ఎల్ఓసీకి సమీపంలోని కుప్వారా జిల్లాలో ఒక ఫార్వార్డ్ పోస్ట్‌ను రక్షణ మంత్రి సందర్శించారు. అక్కడి సైనికులతో ముఖాముఖీ నిర్వహించారు.అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాజ్‌నాథ్ ఈ పర్యటన విశేషంగా నిలిచింది.

ఇదిలాఉంటే అమర్‌నాథ్ యాత్రకు ఎలాంటి అవరోధం లేకుండా ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టామని, భద్రతా పరిస్థితి అదుపులోనే ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. జూలై 21న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, దీనికి నాలుగు రోజుల ముందే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రదాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ స్వయం ప్రకటిత కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

Tags:    

Similar News