దసరాకు అడ్వాన్స్ ఇవ్వాలి.. టీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నేడు నిర్వహించే భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు […]

Update: 2021-09-26 08:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నేడు నిర్వహించే భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

నిరసన ప్రదర్శనలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధానకార్యదర్శి విఎస్ రావు, కో కన్వీనర్స్ అబ్రహం, ఎస్. సురేష్, బి. యాదయ్య, పి. హరికిషన్, వెంకట్ గౌడ్, గోపాల్, స్వాములయ్య, రవీందర్ రెడ్డి, రామచంద్రయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News